ఇంటర్‌లో మైనారిటీ గురుకుల విద్యార్థుల ప్రతిభ భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో మైనారిటీ గురుకుల విద్యార్థుల ప్రతిభ భేష్‌

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

సాక్షి,సిటీబ్యూరో: ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గురుకులాల విద్యాసంస్థల సొసైటీల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణతతో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారని తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల సొసైటీ (టెమ్రీస్‌) వైస్‌ చైర్మన్‌ ఫహీముద్దీన్‌ ఖురేషీ, కార్యదర్శి షఫీ ఉల్లా వెల్లడించారు. బుధవారం టెమ్రీస్‌ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 90 శాతం మంది, ప్రథమ సంవత్సరంలో 81 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో షమీమ్‌ నిఖత్‌ (జడ్చర్ల) 470 మార్కులు, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో అయేషా బేగం (అసిఫ్‌ నగర్‌) 996 మార్కులు, సాధించారన్నారు.

టెమ్రీస్‌ వైస్‌ చైర్మన్‌ ఫహీముద్దీన్‌ ఖురేషీ

Advertisement
 
Advertisement
Advertisement