వారసత్వ సంపదకు నిలయం తెలంగాణ | - | Sakshi
Sakshi News home page

వారసత్వ సంపదకు నిలయం తెలంగాణ

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

మంత్రి జూపల్లి కృష్ణారావు

గోల్కొండ: అద్భుతమైన చారిత్రక కట్టడాలు వారసత్వ సంపదకు తెలంగాణ నిలయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన గోల్కొండ సమీపంలోని కుతుబ్‌షాహీ టూమ్స్‌, కఠొరా హౌస్‌తో పాటు ఖజానా బిల్డింగ్‌, గోల్కొండ కోట బస్టాప్‌ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం గోల్కొండ బడాబజార్‌లోని ఖజానా బిల్డింగ్‌ మ్యూజియంను సందర్శించారు. ఖజానా బిల్డింగ్‌లో ఉన్న విలువైన కళాఖండాలను పరిశీలించారు. హైదరాబాద్‌ను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌మోహియుద్దీన్‌, టీజీడీడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్‌ అర్జున్‌రావు, ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కార్యాలయ డైరెక్టర్‌ కె.గణేష్‌రెడ్డి తదితరులున్నారు. కాగా.. మంత్రి జూపల్లి పర్యటనలో చిన్న అపశ్రుతి దొర్లింది. మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. కార్ల వేగం అంతగా లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement