ఉమ్మడి వరంగల్ జిల్లాల వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకు వివిధ కేటగిరీల్లో సుమారు 564 పోస్టులను మంజూరు చేశారు. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, అనస్తీషియా టెక్నీషియన్లు, సాంకేతిక సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చారు.
● హనుమకొండకు 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 10 అసోసియేట్ ప్రొఫెసర్లు, వరంగల్ జిల్లా కింద 40 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్తీషియా టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బందిని కేటాయించారు.
● ఎంజీఎం/కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 15 ప్రొఫెసర్లు, ఏసీ మెకానిక్, ఆడియాలజిస్ట్ తదితర పోస్టులు ఇచ్చారు.
● మహబూబాబాద్‌కు 50 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 35 అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్తీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు.
● ములుగు జిల్లాకు 56 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 28 అసోసియేట్ ప్రొఫెసర్లు, 7 ట్యూటర్లు, అనస్తీషియా టెక్నీషియన్లు, ఇతర పోస్టులు ఇచ్చారు.
● జనగామకు15 మంది అసిస్టెంట్, 26 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్తీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు.
● జయశంకర్ భూపాలపల్లికి 53 అసిస్టెంట్, 22 అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సాంకేతిక పోస్టులు మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


