వరంగల్ అర్బన్: అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తడి, పొడి చెత్త సేకరణ కోసం మోడల్ డివిజన్‌గా ఎంపిక చేసిన 26లోని చార్‌బౌళి, గిర్మాజీపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, స్వచ్ఛ ఆటోలు సమయపాలన తదితర విషయాలను స్థానిక గృహాల యాజమానుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సంపేట గ్రాండ్ ఎంట్రెన్స్, ఖమ్మం గ్రాండ్ ఎంట్రెన్స్ ప్రాంతాలను పరిశీలించారు. ఎంజీఎం ఎదురుగా స్వీపింగ్ మిషన్‌తో చేపడుతున్న రహదారి శుభ్రత పనుల్ని పరిశీలించారు. అనంతరం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై ఆరా తీశారు. ఆయన వెంట సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, సీహెచ్‌ఏహెచ్ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్లు గోల్కొండ శ్రీను, భాస్కర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న


