● పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి
హన్మకొండ: రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్లు బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి తెలిపారురు. శనివారం హనుమకొండ దీన్‌దయాల్ నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ పోస్టర్, మిస్డ్ కాల్ నంబర్‌ను సంతోశ్‌రెడ్డి, నాయకులు ఆవిష్కరించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్, నాయకులు రావు పద్మారెడ్డి, డా.కాళీప్రసాద్, పులి సరోత్తంరెడ్డి, డా.విజయ్ చందర్‌రెడ్డి, కాసర్ల రుత్విక్‌రెడ్డి, గుజ్జుల వసంత, కందగట్ల సత్యనారాయణ, నాను నాయక్ పాల్గొన్నారు.


