త్వరగా పరిహారం చెల్లించండి | - | Sakshi
Sakshi News home page

త్వరగా పరిహారం చెల్లించండి

Jul 26 2026 8:00 AM | Updated on Jul 26 2026 8:00 AM

త్వరగా పరిహారం చెల్లించండి

హన్మకొండ అర్బన్‌: గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి, గౌరెల్లి, చొక్కారావు దేవాదుల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో నిర్వహించిన సమీక్షలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని కలెక్టర్‌ సమీక్షించారు. సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేశ్‌, వెంకన్న, జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ భరద్వాజ్‌, భూసేకరణ విభాగ పర్యవేక్షకుడు జగత్‌సింగ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణకు

సమష్టిగా కృషి చేయాలి..

2027 డిసెంబర్‌ 1 నాటికి హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణ సాధనకు జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం, వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్‌ఐవీ నివారణ, ఎయిడ్స్‌ నియంత్రణ కమిటీ సమావేశంలో వైద్యాధికారులు, కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు. హైరిస్క్‌ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి కౌన్సిలింగ్‌, పరీక్షలు మరింత పెంచాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌ఐవీ టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మదన్‌ మోహన్‌ రావు, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ మేనేజర్‌ స్వప్న మాధురి, ఏఆర్టీ కేంద్ర వైద్యులు డాక్టర్‌ సూర్యప్రకాశ్‌, డాక్టర్‌ హంపీ, డాక్టర్‌ అనిరుద్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి వి.అశోక్‌ రెడ్డి, డాప్కో రామకష్ణ, కమలాకర్‌, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఐసీటీసీ కౌన్సిలర్లు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

అధికారులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement