కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ పీజీ కళాశాల కామర్స్‌అండ్‌బిజినెస్‌మేనేజ్‌మెంట్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓ రవీందర్( 52) శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. విధులు నిర్వర్తించిన అనంతరం హనుమకొండ ఎన్‌జీఓఎస్ కాలనీలో తాను నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందారని నిర్ధారించారు. రవీందర్‌కు భార్య,కుమారుడు, కూతురు ఉన్నారు. రవీందర్ మృతి సమాచారం అందుకున్న కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి, పలువురు అధ్యాపకులు రవీందర్ మృతదేహాన్ని సందర్శించారు. రవీందర్ మృతితో కుటుంబంతోపాటు సహచర అధ్యాపకుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా రవీందర్ కుటుంబం ఎన్‌జీఓఎస్ కాలనీలో అద్దెభవనంలో నివసిస్తోంది. రవీందర్ మృతదేహాన్ని శనివారం రాత్రి ఆస్పత్రి నుంచి సొంత గ్రామం చిన్నకోడెపాకకు తరలించారు. ఆదివారం అక్కడే అంత్యక్రియలు జరగనున్నాయని సహచర అధ్యాపకులు తెలిపారు.


