‘ప్రధాని మోదీ మెడలు వంచిన రాహుల్‌ గాంధీ’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రధాని మోదీ మెడలు వంచిన రాహుల్‌ గాంధీ’

Jul 26 2026 8:00 AM | Updated on Jul 26 2026 8:00 AM

‘ప్రధాని మోదీ మెడలు వంచిన రాహుల్‌ గాంధీ’

హన్మకొండ చౌరస్తా: నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కేంద్రం మెడలు వంచి వి ద్యార్థుల అభీష్టాన్ని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ శని వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు నెల రోజులుగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. ఈ క్రమంలో వి ద్యార్థులకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిచి దేశవ్యాప్తంగా ఉద్యమించడంతో కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీని గద్దెదించడమే తమ కర్తవ్యమని, రా హుల్‌ గాంధీని ప్రధానిగా చేసేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపా రు. నిరసనల్లో మృతి చెందిన విద్యార్థులకు స్వర్ణ ప్రగా ఢ సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారికి మె రుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబా లకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement