వరంగల్ క్రైం : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలసముద్రంలో శనివారం ఓ ఇంట్లో యువకుడు అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నక్కలగుట్టలోని లిటిల్ మంకీస్ బేకరీలో పనిచేసే బాసిక నాగరాజు(25) ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు లేవనెత్తారు. ఘటనాస్థలిలో ఉరేసుకోవడానికి ఎలాంటి ఆధారం లేకపోవడం అనుమానాలకు కారణమైంది. నడికూడ మండలం ధర్మరం గ్రామానికి చెందిన నాగరాజు ఆత్మహత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బాలసముద్రం చేరుకున్నారు. కుటుంబ సభ్యులు రాకముందే మృతదేహం తొలగించాలని పోలీసులు యత్నించారని, గతంలో సుబేదారి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై సుమన్ తమ కుమారుడిని అకారణంగా కొట్టారన్నారు. అప్పటి నుంచి నాగరాజు మానసిక వేదనకు గురైనట్లు ఆరోపించి తమకు న్యాయం చేయాలని కుటుంబీకులు, బంధువులు ఘటనాస్థలిలో రాత్రి 8.30 గంటల వరకు ఆందోళన చేపట్టారు. కాగా, గతంలో బేకరీ నుంచి ఎస్సై సుమన్.. నాగరాజును బయటకు తీసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది.
ఎస్సైతోపాటు ఇద్దరిపై కేసు నమోదు..
కుటుంబ సభ్యులు, బంధువులు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను కలిసి నాగరాజు మృతిపై అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. కాగా, నాగరాజు తండ్రి చేరాలు ఫిర్యాదు మేరకు ఎస్సై సుమన్‌తో పాటు బేకరీ యజమాని శ్రీకాంత్, జిమ్ సెంటర్ యజమా ని సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్ తెలిపారు.
నాగరాజు ఆత్మహత్యతో వెలుగులోకి
కుళ్లిన ఆహార పదార్థాలు..
నక్కలగుట్టకు చెందిన లిటిల్ మంకీస్ బేకరీ స్టోరేజీలో కుళ్లిన చికెన్‌తోపాటు ఇతర పాడైన ఆహార పదార్థాలు పెద్ద మొత్తంలో నిల్వ చేశారు. నాగరాజు మృతదేహం చూడడానికి వచ్చిన వారికి కుళ్లిన ఆ హార పదార్థాలు దర్శనమిచ్చాయి. ఈ ఘటనలో ని ర్వాహకులపై ఇప్పటి వరకు టాస్క్‌ఫోర్స్, పోలీసు అధికారులు దృష్టిసారించకపోవడంపై పలు ఆరోపణాలు వస్తున్నాయి. ఫుడ్‌సెఫ్టీ అధికారులు కూడా బేకరీ, హోటళ్లపై దాడులు చేసి ఆహార పదార్థాలను తనిఖీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
సుబేదారి ఎస్సైతో సహా
ఇద్దరిపై కేసు నమోదు
కుటుంబీకులు, బంధువుల ఆందోళన


