విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం

Jul 26 2026 8:00 AM | Updated on Jul 26 2026 8:00 AM

టీఎస్‌ ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌

హన్మకొండ: విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌ ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్‌లోని టీఎస్‌ ఈఈయూ కార్యాలయంలో పల్లా రవీందర్‌ రెడ్డి భవన్‌లో విద్యుత్‌ ఆర్టిజన్ల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇనుగాల శ్రీధర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఐదేళ్లకు ఇవ్వాల్సిన గ్రేడ్‌ ప్రమోషన్లు ఎనిమిదేళ్లు పూర్తయినా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దేశంలో ఒకే సంస్థలో రెండు రకాల సర్వీస్‌ రూల్స్‌ అమలులో ఉండడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టిజన్‌ ఉద్యోగులకు కూడా ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌ ఈఈయూ–327 టీజీ ఎన్పీడీసీఎల్‌ అధ్యక్షుడు పి.మహేందర్‌ రెడ్డి, టీఎస్‌ ఈఈయూ–327 రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీలం ఐలేశ్‌, కంపెనీ కార్యదర్శి శ్రీనివాస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.హెచ్‌ నరేందర్‌ రెడ్డి, నాయకులు కట్ల సదయ్య, తులసి శ్రీమతి రెడ్డి, దొనికల సద య్య, మచ్చిక బుచ్చయ్య గౌడ్‌, చిట్ల ఓదెలు, పప్పు వెంకటేశ్వర్లు, సలీం పాషా, కోరుకొప్పుల రాంబాబు, చింతలపూడి సతీశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement