హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న వరుణ పూజల్లో భాగంగా రెండో రోజు రుద్రేశ్వరస్వామికి ఘనంగా శతఘటాభిషేకం నిర్వహించారు. శనివారం ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు రుద్రేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో వరిధాన్యంపై 108 ఘటాలకు మూలయుక్తంగా పూజలు నిర్వహించారు. పూజల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు, బల్దియా కమిషనర్ వెంకన్న నాయక్, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు గట్టు మహేశ్‌బాబు, వరంగల్ దేవాదాయశాఖ పరిశీలకులు నందనం కవిత పాల్గొన్నారు. ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.


