హన్మకొండ: ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా గురువారం రాత్రి హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కులో విద్యార్థులు ధర్నా చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడంపై స్పందించిన వరంగల్ నగరానికి చెందిన, కిట్స్ కళాశాల విద్యార్థిని శ్రీనిత ‘ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థులకు మనం మద్దతు ఎందుకు ఇవ్వకూడదు.. వరంగల్ కేంద్రంగా ధర్నా చేద్దాం’ అని ఇన్‌స్టాలో రీల్ పోస్టు చేసింది. స్పందించిన విద్యార్థులు వరంగల్ మహానగరంతోపాటు వివిధ ప్రాంతాలనుంచి భారీగా తరలివచ్చారు. ధర్నా అనంతరం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వీరికి తెలంగాణవాది సంగంరెడ్డి పృథ్వీరాజ్‌తోపాటు మరికొందరు సంఘీభావం తెలిపారు.
ఇన్‌స్టాలో రీల్‌కు స్పందించి భారీగా చేరుకున్న విద్యార్థులు


