‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియకు సహకరించాలి

Jul 24 2026 1:57 AM | Updated on Jul 24 2026 1:57 AM

‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియకు సహకరించాలి

హన్మకొండ అర్బన్‌: గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ కోరారు. జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిపై గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్‌, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌సింగ్‌, కాజీపేట తహసీల్దార్‌ రాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రావు అమరేందర్‌ రెడ్డి, ఎండీ.నేహాల్‌, బి.ప్రవీణ్‌ కుమార్‌, గొడుగు వెంకట్‌, అంబాల ప్రశాంత్‌, కె.సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వినూత్న సాంకేతికతకు ప్రాధాన్యం

జల వనరుల సమర్థ నిర్వహణ, నీటి వృథా నివారణ, మురుగునీటి శుద్ధి, భూగర్భ జలాల పరిరక్షణకు వినూత్న సాంకేతికతలను జీడబ్ల్యూఎంసీ పరిధిలో ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఎన్‌ఐటీ వరంగల్‌ ఆధ్వర్యంలో రూపొందించిన మురుగునీటి శుద్ధి సాంకేతికత, ఐఓటీ ఆధారిత స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలపై ప్రత్యేక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కలెక్టర్‌ పరిశీలించారు. ఇందులో సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఎస్‌.రాజ్‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు మహేందర్‌, సంజయ్‌, డీఈ స్పందన, ఎనన్‌ఐటీ వరంగల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శిరీష్‌, స్టార్టప్‌ ప్రతినిధి హిరణ్య తల్లం, ఆస్కీ కో–ఆర్డినేటర్‌ రాజమోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement