న్యూశాయంపేట: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని భూముల రీసర్వే పనులు పారదర్శకంగా, వేగంగా పూర్తిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లకు కేటాయించిన గ్రామాల్లో సర్వే పనులు గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు.
ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి
ఎలినినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతున్నందున తాగునీరు, సాగునీరు, పశుగ్రాసం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్‌లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీడీలు, తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేసి రోజువారీ నివేదికలను సమర్పించాలని కోరారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వ్యవసాయశాఖాధికారి విజయభాస్కర్,, ఏడీ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రచారి, సిబ్బంది, సర్వేయర్‌లు పాల్గొన్నారు.
సమీక్షలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద


