విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి

Jul 24 2026 1:57 AM | Updated on Jul 24 2026 1:57 AM

కాళోజీ సెంటర్‌: విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, ప్రాజెక్టుల రూపకల్పనలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని వరంగల్‌ జిల్లా సైన్‌న్స్‌ అధికారి డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌ అన్నారు. జాతీయ బాలల సైన్‌న్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సీఎస్‌సీ) ప్రాజెక్టులపై తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ప్రైవేట్‌ పాఠశాలల సైన్‌న్స్‌ ఉపాధ్యాయులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు తమ గ్రామం లేదా నివాస ప్రాంతాల్లోని స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి శాసీ్త్రయ మార్గాల్లో పరిష్కారాలు చూపించేలా ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా మాజీ కోఆర్డినేటర్‌ కటంగూరు రాంగోపాల్‌రెడ్డి, జిల్లా అకడమిక్‌ కోఆర్డినేటర్‌ చల్లా కృష్ణారెడ్డి, రిసోర్స్‌ పర్సన్‌ పెట్లోజు సురేశ్‌బాబు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రవణ్‌కుమార్‌, పాఠశాల డైరెక్టర్‌ తాళ్ల వరుణ్‌, పలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సైన్‌న్స్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement