సూచికల ఆవిష్కరణలు | - | Sakshi
Sakshi News home page

సూచికల ఆవిష్కరణలు

Jul 24 2026 1:57 AM | Updated on Jul 24 2026 1:57 AM

నేడు ప్రకృతి వైద్య గ్రంథ

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, హ్యుమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం విశ్రాంత ఆచార్యుడు గజ్జెల రామేశ్వరం హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డి పేటలో తన ఇంట్లోనే ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ నేచురోపతి లైబ్రరీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శుక్రవారం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగిడబోతుంది. దేశ, విదేశీ భాషల్లో 5 వేలకు పైగా ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్‌ ఈ లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్న వారికి ఉచితంగానే చదువుకునే అవకాశం కల్పించిన విషయం విధితమే.

అరుదైన ప్రకృతి వైద్య గ్రంథ

సూచికలు రాసిన రామేశ్వరం

నేచురోపతి లైబరీ రీసెర్చ్‌ సెంటర్‌లో ఉన్న అరుదైన ప్రకృతి వైద్య పుస్తకాలు, వివిధ జర్నల్స్‌ ముఖ్యంగా వివిధ రోగాలను ఎలా ప్రకృతి వైద్య పరంగా నివారించుకోవాలనే అంశంపై ఆచార్య రామేశ్వరం 25 గ్రంథ సూచికలు రాశారు. అందులో 11 వరకు ఈనెల 24న ఉదయం 10: 30 గంటలకు కేయూ పరిపాలన భవనంలోని సెనెట్‌హాల్‌లో ఆవిష్కరించబోతున్నారు. కేయూ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రకృతి వైద్య గ్రంథ సూచికల ఆవిష్కరణ, రీసెర్చ్‌ సెంటర్‌ 8వ వార్షికోత్సవం నిర్వహించబోతున్నారు.

ఆవిష్కరించనున్న ప్రకృతి వైద్య గ్రంథ

సూచికలు ఇవే..

ప్రొఫెసర్‌ గజ్జెల రామేశ్వరం రాసిన గ్రంథ సూచికల్లో ముఖ్యంగా ప్రకృతిజీవన్‌ మాసపత్రిక వ్యాస సూచిక, ప్రకృతి వైద్యంలో రోగ నివారణ వృత్తాంతములు, డాక్టర్‌ వెంకట్‌రావు ప్రకృతి వైద్య వ్యాస సూచిక, ప్రకృతి వైద్య గ్రంథసూచి, డాక్టర్‌ విజయలక్ష్మి ప్రకృతి వైద్యవ్యాస సూచి, యోగా గ్రంథ సూచి, ఇంగ్లిష్‌లో ఇండెక్స్‌ టుది ఇండియన్‌ నేచురోపతి ఉన్నాయి. అలాగే, మరో రెండు హిందీ, మరొకటి మరాఠీ భాషలో ప్రకృతి వైద్య గ్రంథ సూచికలున్నాయి. వీటిని అతిథులు ఆవిష్కరించబోతున్నారు.

రానున్న రెండు వర్సిటీల వీసీలు, ప్రముఖులు

ప్రొఫెసర్‌ రామేశ్వరం రాసిన ఈ ప్రకృతి వైద్య గ్రంథాల వ్యాస సూచికల ఆవిష్కరణ కార్యకమంలో ముఖ్య అతిథిగా కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల ఉప కులపతులు ఖాజాఅల్తాఫ్‌హుస్సేన్‌, టి. యాదగిరిరావు, రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ రియాజ్‌, హైదరాబా ద్‌ సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మోహన్‌రావు, హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ హెరిటేజ్‌ డైరెక్టర్‌ పి. ప్రసాద్‌, తదితరులు పాల్గొనబోతున్నారని రామేశ్వరం తెలిపారు. ఈ సభకకు కేయూ రిటైర్డ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సదానందం అధ్యక్షత వహిస్తారు.

నేచురోపతి ఇంటర్నేషనల్‌ లైబ్రరీ రీసెర్చ్‌ సెంటర్‌ 8వ వార్షికోత్సవం కూడా..

కేయూకు రానున్న రెండు వర్సిటీల వీసీలు.. ప్రకృతి వైద్య ప్రముఖులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement