దాశరథి జీవితం ఆదర్శప్రాయం | - | Sakshi
Sakshi News home page

దాశరథి జీవితం ఆదర్శప్రాయం

Jul 24 2026 1:57 AM | Updated on Jul 24 2026 1:57 AM

అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరస్వామి

విద్యారణ్యపురి: దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ మహా కవిగా ఎదిగారని, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేరు వీరస్వామి అన్నారు. గురువారం హనుమకొండలోని సమత హైస్కూల్‌లో తెలంగాణ మహా కవి దాశరథి జయంతిని అభ్యుదయ రచయితల సంఘం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దాశరథి రచనలు తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. ప్రధాన వక్తగా అరసం వరంగల్‌ ప్రధాన కార్యదర్శి మార్కశంకర్‌నారాయణ మాట్లాడుతూ దాశరథి సాంప్రదా యక కుటుంబం నుంచి వచ్చినా వామపక్ష భావాలతో ఎదిగి ప్రత్యక్షంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధుడన్నారు. ‘తిమరంతో సమచం’ అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో దాశరథికి వచ్చిందన్నారు. కాగా, గద్వాల సోమన్న రాసిన సిరిమల్లె చెట్టు 103వ పుస్తకాన్ని అరసం రాష్ట్ర అధ్యక్షుడు నిధి బ్రహ్మచారి ఆవిష్కరించారు. బాధ్యుడు పిట్ట సాంబయ్య పుస్తకాన్ని సమీక్షించగా దాశరథిపై మార్క శంకర్‌నారాయణ రాసిన పాటను వీరస్వామి ఆవిష్కరించారు. ఆ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ కరుణాసాగర్‌రావు, అరసం బాధ్యులు రామబ్రహ్మం, మాజీ జిల్లా విద్యాశాఖాధికారి రామేశ్వర రాజు, రాజన్న, వెంకటేశ్వర్లు, కోటేశ్వర్‌రావు, రాంగారావు, అనిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement