● ఆగస్టులో ఒకేసారి మూడునెలల
రేషన్ బియ్యం పంపిణీ
● ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు
ఖిలా వరంగల్: వర్షాకాలం నేపథ్యంలో రేషన్ కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ముందుగా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఆగస్టులో ఒకేసారి పంపిణీ చేయనున్నారు. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
16,782.804 మెట్రిక్ టన్నుల
బియ్యం అవసరం
వరంగల్ జిల్లాలో 509 షాపులున్నాయి. మొత్తం 2,93,824 రేషన్ కార్డులు ఉండగా.. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆయా లబ్ధిదారులకు సన్న బియ్యం అందించేందుకు ప్రతీ నెల 5504.268 మెట్రిక్ టన్నులు మేర కేటాయిస్తున్నారు. జూలై నెలకు సంబంధించి నేటితో (సోమవారం) పంపిణీ గడువు ముగియనుంది. వచ్చే నెల ఆగస్టు 1 నుంచి ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలంటే మొత్తం 16,782.804 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నాయి. ఇటీవల జారీ అయిన నూతన కార్డులకు మరికొంత స్టాక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
డీలర్లకు మరోసారి కష్టాలే!
ఆగస్టు మాసంలో మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రేషన్ డీలర్లకు మరోసారి కష్టాలు తప్పేలాలేవంటున్నారు. మూడు నెలల స్టాక్ దించుకునేందుకు షాపుల్లో స్థలం లేక గతంలో ఇబ్బందులు పడ్డారు. అమ్మికొద్ది బియ్యం తెచ్చుకోవడంతో అదనపు ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని డీలర్లు అంటున్నారు. హమాలీ చార్జీలు, ఇతర ఖర్చులతో మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాలు రాగానే మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడుతాం. గోదాముల్లో సన్న బియ్యం నిల్వ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాం. జూలై నెల మాసం పంపిణీ ముగిసిన తర్వాత జిల్లాలోని రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు ఏ మేరకు ఉన్నాయి.. ఎంత సరఫరా చేయాలనేది
– కిష్టయ్య, డీఎస్‌ఓ, వరంగల్


