విద్యారణ్యపురి: మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాల మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల సమావేశాన్ని హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ వ్యవస్థను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.మహేశ్, ఉమ్మడి జిల్లా బాధ్యులు నార శ్రీనివాస్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, బాధ్యులు సుజన్ ప్రసాద్‌రావు, టి.కుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. సమావేశంలో టీఎస్‌ఎం ఎస్‌టీఎఫ్ రాష్ట్ర నాయకులు కె.వీలాద్రి మోహన్‌రావు, ఆయోస్కాన్, ఉషాపద్మిని, నాగలక్ష్మి, ప్రశాంతి, సత్యనారాయణ, అశోక్, విజయకుమారి, రఘుపతి, రవి, రాజేంద్రప్రసాద్, రాజు, విజయ్, మధు, వివిధ జిల్లాల మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


