ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.పూజ
కాజీపేట అర్బన్: ర్యాగింగ్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ అడుగులు వేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.పూజ సూచించారు. కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ర్యాగింగ్ వినోదంతో మొదలై మానసిక, శారీరక హింసకు, బలవన్మరణాలకు దారితీస్తుందని తెలిపారు. విద్యాసంస్థల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు భయభ్రాంతులకు గురిచేయడం, అవమానించడంతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. చీఫ్ లీగల్ ఏయిడ్ కౌన్సిలర్ ఆర్.సురేశ్, అసిస్టెంట్ లీగల్ ఏయిడ్ ఆర్.రజిని, కళాశాల యాజమాన్యం, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.


