వరంగల్ క్రైం: కాంగ్రెస్ కార్యకర్త, వర్ధన్నపేట నియోజవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అడప మహేశ్‌పై రౌడీషీటర్ పత్తి కుమార్ శనివారం రాత్రి 10 గంటలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటిలింగాల ప్రాంతంలో జరిగింది. ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన అడప మహేశ్.. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు అత్యంత సన్నిహితుడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడంతో అది జీర్ణించుకోలేని పత్తి కుమార్ మరో కాంగ్రెస్ కార్యకర్త జన్ను కుమార్‌తో మహేశ్‌ను శనివారం రాత్రి కోటిలింగాల ప్రాంతానికి పిలిపించాడు. ‘నా గురించి ఎమ్మెల్యేకు ఏం చెప్పావు’ అని మహేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు బాధితుడు మహేశ్ దుఃఖంతో ఉన్న వీడియో వైరల్‌గా మారింది. స్థానికులు తీవ్ర గాయాలైన మహేశ్‌ను రాత్రి 11 గంటలకు చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గతంలో కుమార్ తనపై హత్యాయత్నం చేసినట్లు బాధితుడు తెలిపాడు. అతన్ని ఎందుకు ఎన్‌కౌంటర్ చేయడం లేదు? ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు, సీపీలు నిర్ణయం తీసుకుని అతన్ని ఎన్‌కౌంటర్ చేయాలని బాధితుడు వీడియోలో వేడుకున్నాడు. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో నమ్మకమైన కార్యకర్తగా పనిచేస్తున్నానని, తన అవయవాలు పాడై పోయాయని, తెలియక ఏమైనా తప్పుచేస్తే క్షమించాలని ఎన్‌టీఆర్ నగర్ ప్రజలను కోరాడు.
గతంలోనే కుమార్ చేసిన హత్య సంచలనం
రౌడీషీటర్ పత్తి కుమార్ గతంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో చేసిన హత్య సంచలనం కలిగించింది. ఓ వ్యక్తిని చంపి తల, మొండెం వేరుచేశాడు. అదే రౌడీషీటర్ ఇప్పుడు మరోసారి పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం సంచలనంగా మారింది.
ఎంజీఎం ఆస్పత్రికి ఎమ్మెల్యే నాగరాజు..
మహేశ్‌పై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. మహేశ్‌ను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.
కాంగ్రెస్ కార్యకర్తపై రౌడీ
షీటర్ హత్యాయత్నం
తీవ్రగాయాలు..
ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు
బాధితుడు వర్ధన్నపేట పార్టీ
సోషల్ మీడియా ఇన్‌చార్జ్
ఫ్లాష్.. ఫ్లాష్


