ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు గుట్ట ప్రాంతంలో చట్టవిరుద్ధంగా లాటరీ నిర్వహిస్తూ అమాయక ప్రజల సొమ్ము కాజేస్తున్న అక్రమ లాటరీ స్థావరంపై వరంగల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. అమాయక ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ కార్ గిఫ్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు.. వెంకటేశ్వర కార్ గిఫ్ట్ కాంటెస్ట్ కార్యాలయంలో ట్రాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. వరంగల్ పోచమ్మ మైదాన్‌లోని గాయత్రి కాలనీకి చెందిన పూజారి సుమన్, హనుమకొండ సుబేదారి దుర్గాకాలనీకి చెందిన సముద్రా రాజేశ్, సంగెం మండలం తీగరాజుపల్లి, శివనగర్ మెట్ల బావికి చెందిన కర్ణు గట్టి సురేశ్‌ను పట్టుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ.4,70 లక్షల విలువైన బ్రీజా కారు, రూ.11,50,000 లక్షల విలువైన 5,753 లాటరీ స్లిప్పులు. 6 స్మార్ట్ ఫోన్లు, రూ.53,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తలిపారు.
సుజుకీ బ్రీజా కారు, నగదు స్వాధీనం
ముగ్గురు నిర్వాహకులపై కేసు


