కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి –దానాపూర్–చర్లపల్లి మధ్య ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్‌లను మరికొన్ని రోజులపాటు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు.
పొడిగింపు రైళ్ల వివరాలు..
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు 9 సర్వీస్‌లతో చర్లపల్లి–దానాపూర్ (07091) ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు ప్రతీ సోమవారం 15:00 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు 9 సర్వీస్‌లతో దానాపూర్–చర్లపల్లి (07092) ఎక్స్‌ప్రెస్ ప్రతీ మంగళవారం 8:00 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు కాజీపేట, రామగుండం, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్లార్షా, చాందాపోర్టు, గోండియా, బాల్‌ఘట్, నైన్‌పూర్, జబల్‌పూర్, కఠ్నీ, సంత, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, చౌకీ, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బాక్సర్, ఆరా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.


