నేను పసుపు పంటను మొదటి నుంచి కొంతమేర అయినా సాగు చేస్తా. ఈ సారి ఎకరం భూమిలో సాగు చేశా. ఎ కరానికి రూ.75వేల ఖ ర్చు వచ్చింది. 23 క్వింటాళ్ల నంట చేతికొచ్చింది. గురువారం మార్కెట్‌లో అమ్ముకున్నా. క్వింటాకు ధర రూ.15,551 దక్కింది. ఈ సారి రేటు కలిసి రావడం ఆనందంగా ఉంది.
–గడ్డం సుధాకర్, చింతనెక్కొండ గ్రామం
విత్తనం దొరకడం లేదు
మొదటి నుంచి నేను పసుపు పంట సాగు చేసేవాన్ని. కానీ మార్కెట్‌లో రేటు తగ్గడం, పంట దిగుబడి కూడా తగ్గుతుండడంతో చేసేది ఏమీలేక 5 ఏళ్లుగా పసుపు సాగు చేయడంలేదు. ఈ సారి మార్కెట్‌లో పసుపు ధర పెరగడం ఊరటనిస్తుంది. కానీ పంట సాగు చేద్దామంటే విత్తనం దొరకడం లేదు. అందుకే ఈసారి 6 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నా.
–లక్కాకుల సత్యనారాయణ,
కేసముద్రం విలేజ్


