‘నీట్‌’లో ఎస్సార్‌ విద్యార్థికి ఆలిండియా 9వ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’లో ఎస్సార్‌ విద్యార్థికి ఆలిండియా 9వ ర్యాంకు

Jul 17 2026 12:52 AM | Updated on Jul 17 2026 12:52 AM

హన్మకొండ: దేశవ్యాప్తంగా గురువారం విడుదలైన నీట్‌–2026 ఫలితాల్లో ఎస్సార్‌ విద్యాసంస్థలు మరోసారి ప్రతిభ చాటాయి. ఆ సంస్థ విద్యార్థి వీరయ్యగారి సహ్యూ ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 9వ ర్యాంకు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి ఈ ఘనతను అందుకున్నట్లు ఎస్సార్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వరదారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించిన ఆయన, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన శిక్షణ, అధ్యాపకుల నిరంతర మార్గదర్శకత్వం, విద్యార్థి పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. అనంతరం విద్యార్థి వీరయ్యగారి సహ్యూను సంస్థ డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement