వరంగల్ స్పోర్ట్స్ : క్రీడల్లో గెలుపోటములు సహజమని, పట్టుదలతో పోరాడిన వారికే విజయం సొంతమవుతుందని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వి. తిరుపతి రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలో జేఎన్‌ఎస్‌లో తెలంగాణ ట్రాన్స్‌కో, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి నిర్వహిస్తున్న ఇంటర్ సర్కిల్ వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, క్యారం క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నారన్నారు. అనంతరం డైరెక్టర్ ఆపరేషన్స్ టి. మధుసూదన్ మాట్లాడుతూ పోటీల్లో విజయం వైపు అడుగులు వేయాలని క్రీడాకారులను ప్రోత్సహించారు. డైరెక్టర్ హెచ్‌ఆర్‌డీ సి. ప్రభాకర్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు సేవా కార్యక్రమాల్లోనే కాకుండా క్రీడారంగంలోనూ ముందుంటారన్నారు. ఈ పోటీల్లో వాలీబాల్ 20, బాల్ బ్యాడ్మింటన్ 11, క్యారం 15 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్, సీజీఎం వేణు బాబు, ప్రెసిడెంట్ స్పోర్ట్స్ కౌన్సిల్, సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్ హనుమకొండ బి.సామ్యా నాయక్ , స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యులు, ఎస్‌ఈలు ఎ.ఆనందం, సి.హెచ్ సంపత్ రెడ్డి, పి.విజయేందర్ రెడ్డి, ఎ. రమేశ్ , బి.భిక్షపతి, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, కన్వీనర్ కె.దర్శన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి
ట్రాన్స్‌కో – డిస్కంల ఇంటర్ సర్కిల్ క్రీడలు ప్రారంభం


