కేయూ క్యాంపస్ : భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావ జాల వ్యాప్తి జరగాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ పుల్లా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ హాజరై పుల్లాశ్రీనివాస్‌ను అభినందించి మాట్లాడారు. పుల్లా శ్రీనివాస్ నేతృత్వంలో అంబేడ్కర్ స్టడీస్‌సెంటర్ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ప్రొఫెసర్ గాదె సమ్మయ్య, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్‌లాల్, చిర్రరాజు,బీసీ సెల్‌డైరెక్టర్ బొడిగ సతీశ్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు రమణ, భిక్షాలు, అవెన్యూ ప్లాంటేషన్ ఇన్‌చార్జ్ బి. వెంకటగోపినాథ్, వివిధ సంఘాల బాధ్యులు సంగాల ఇప్రిమ్‌రాజు, మెట్టు రవి, చిరంజీవి, బొక్కమొగిలి, బొళ్లపాక ప్రభాకర్, కృష్ణమాచార్య, డిప్యూటీ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు నేతాజీ, కోల శంకర్, ప్రణయ్‌కుమార్, నర్సింహారావు , ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద కుమార్, సుకుమార్ మాదిగ, పుట్టరవి, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు బి. తిరుపతి, మంద నరేశ్, మంద భాస్కర్, కలకోట్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ


