వరంగల్ కలెక్టర్ సత్యశారద
మామునూరు: ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ఎన్యూమరైజేషన్, డిజిటలైజేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధి తిమ్మాపురం(హవేలీ), బెస్తం చెరువు కాలనీలో కలెక్టర్ బుధవారం పర్యటించి బూత్ లెవల్ అధికారుల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీఓ సుమ, ఏఓ ఫణికుమార్, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, హసన్‌పర్తి తహసీల్దార్లు రవీందర్‌రెడ్డి, సూపర్‌వైజర్ రజిని పాల్గొన్నారు.
‘సర్’పై రాజకీయ పార్టీలతో సమీక్ష
న్యూశాయంపేట: ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (సర్)పై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏఐ వినియోగంపై శిక్షణ
ఏఐ వినియోగంపై వరంగల్ కలెక్టరేట్‌లో బుధవా రం అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా చాట్ జీపీటీ, గూగుల్ నోట్‌బుక్ కేఎల్‌ఎం, క్లాడ్‌తోపాటు మొత్తం 15 అధునాతన ఏఐ ఆధారిత ఉత్పాదక సాధనాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, శిక్షకులు వాసుదేవన్ నటరాజన్, రాహుల్, ధీరజ్ పాల్గొన్నారు.


