ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండ

Jul 16 2026 4:54 AM | Updated on Jul 16 2026 4:54 AM

హన్మకొండ: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ, ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ఆయిల్‌ సీడ్స్‌ అండ్‌ గ్రోవర్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌, తె లంగాణ మజ్దూర్‌ యూనియన్‌ వరంగల్‌ రీజియన్‌ గౌరవ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. బుఽ దవారం హనుమకొండ సుబేదారిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో టీఎంయూ వరంగల్‌ రీజియన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో జంగా రాఘ వ రెడ్డిని టీఎంయూ వరంగల్‌ రీజియన్‌ గౌరవాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యలు సీఎం, రవాఖ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. త్వరలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన సమస్య కూడా క్లియర్‌ అవుతుందని అన్నా రు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి టీఎంయూ కృషి చేస్తుందన్నారు. యూనియన్‌ను మరింత బలోపేతం చేయాలన్నా రు. టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌, వరంగల్‌ రీజియన్‌ అధ్యక్షుడు ఎస్‌.కె.వై.పాషా, కార్యదర్శి జి తేందర్‌ రెడ్డి, నాయకులు ఎం.ఆర్‌ రెడ్డి, నిరంజన్‌, రవీందర్‌, ఎండీ గౌస్‌, దామోదర్‌ రెడ్డి, సత్యనారా యణ, నాగశేషు, చంద్రయ్య, కేతిడి అశోక్‌ రెడ్డి, ఎంఎస్‌రావు, ఆర్‌.వి గోపాల్‌, శ్రావణి, మల్లికార్జున్‌, ఆర్‌.సాంబయ్య. టి.విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

తెలంగాణ ఆయిల్‌ సీడ్స్‌ అండ్‌ గ్రోవర్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement