హన్మకొండ: వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరాకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరక్టర్ వి.మోహన్ రావు, ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ రూరల్ డివిజన్ కార్యాలయం నుంచి డివిజన్‌లోని మానవ రహిత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించిన విశ్వనాథపూర్, కాకతీయ మెగాటె క్స్ టైల్స్ పార్కు, కాపుల కనపర్తి సబ్ స్టేషన్లను ప్రారంభించి మాట్లాడారు. నూతన సాంకేతిక పరి జ్ఞానంతో ఆటోమేషన్ విధానంలో ఈ సబ్‌స్టేషన్లు పని చేస్తాయన్నారు. సబ్ స్టేషన్‌లో అమర్చిన సీసీ కెమెరాల ద్వారా డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌ను ఉద్యోగులు పరిశీలిస్తూ సబ్ స్టేషన్ కు సంబంధించిన సరఫరా, అంతరాయాలు, ఇతర సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారులకు స మాచారం అందిస్తారన్నారు. దీంతో వెంటనే లోపాలు సరిదిద్ది విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారన్నా రు. టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్, వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ ఆనందం, డీఈలు దానయ్య, మల్లికార్జున్, రాంబాబు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్
వి.మోహన్ రావు, ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్


