మొబైల్స్‌ రికవరీ.. బాధితులకు అందజేత | - | Sakshi
Sakshi News home page

మొబైల్స్‌ రికవరీ.. బాధితులకు అందజేత

Jul 16 2026 4:54 AM | Updated on Jul 16 2026 4:54 AM

హసన్‌పర్తి: పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను బాధితులకు అందించారు. ఇటీవల హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో మొబైల్‌ ఫోన్లు మాయమైనట్లు బాధితులు సీఈఐఆర్‌ పోర్టర్‌ ద్వారా ఫిర్యాదుచేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.ఽ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని బుధవారం బాధితులకు అందించినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ తెలిపారు. మొబైల్‌ ఫోన్‌ చోరీకి గురైన, పోగొట్టుకున్న బాధితులు వెంటనే సీఈఐఆర్‌ పోర్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. క్రైం బృంద సభ్యులు వెంకట్‌, తిరుపతి, పూర్ధాచారి, గీత,ప్రణవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement