నేటినుంచి ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్‌ సర్కిల్‌ క్రీడలు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్‌ సర్కిల్‌ క్రీడలు

Jul 16 2026 4:54 AM | Updated on Jul 16 2026 4:54 AM

నేషనల్‌ క్రికెట్‌ పోటీలకు కేవీ విద్యార్థి ప్రీతం

హన్మకొండ : తెలంగాణ ట్రాన్స్‌కో, టీజీ ఎన్పీడీసీఎల్‌, టీజీ ఎస్పీడీసీఎల్‌ సంయుక్తంగా ఈ నెల 16 నుంచి ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్‌ సర్కిల్‌ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, హనుమకొండ ఎస్‌ఈ బి.సామ్యా నాయక్‌ తెలిపారు. 2026–2027 ఇంటర్‌ సర్కిల్‌ వాలీ బాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, క్యారం పోటీలు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో వివరించారు. గురువారం ఉద యం 9 గంటలకు క్రీడా పోటీలు ప్రారంభమవుతాయన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారన్నారు. 18న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ముగింపు కా ర్యక్రమంలో విజేతలకు బహుమతులు, ట్రోఫీలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

అతివేగానికి వృద్ధుడు బలి

నెల్లుట్ల వద్ద టీవీఎస్‌

ఎక్సెల్‌ను ఢీకొన్న కారు

వృద్ధుడి దుర్మరణం

లింగాలఘణపురం: అతి వేగంగా వచ్చిన కారు ఓ వృద్ధుడిని బలి తీసుకుంది.. టీవీఎస్‌ ఎక్సెల్‌పై వస్తూ రోడ్డు క్రాస్‌ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆ వృద్ధుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం జనగామ– సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల వద్ద చో టు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగా మ జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన బండి రాంనర్సయ్య(60) టీవీఎస్‌ ఎక్సెల్‌పై నెల్లుట్ల గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు క్రాస్‌ చేస్తున్నాడు. ఈ సమయంలో కారులో జనగామ నుంచి దేవరుప్పులకు వెళ్తున్న బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌నాయక్‌ అతివేగంగా వచ్చి ఎక్సెల్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రాంనర్సయ్య గాలిలో ఎగిరి పడగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే జనగామ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

కాజీపేట అర్బన్‌: కాజీపేట మండలం కడిపికొండలోని పీ ఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ కు చెందిన 9వ తరగతి విద్యార్థి దేవులపల్లి ప్రీతం అండర్‌–17 విభాగంలో 55వ కేవీ నేషనల్‌ క్రికెట్‌ పోటీలకు ఎంపికై నట్లు కేవీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ స్మీత టిప్లే బుధవారం తెలిపారు. ఈఏడాది అక్టోబర్‌ 26న మ హారాష్ట్రలోని పూణేలో జరిగే ఫైనల్‌ పోటీల్లో లెగ్‌ స్పి న్నర్‌గా తన ప్రతిభను కనబర్చనున్నట్లు తెలిపారు.

పీడీఎస్‌ బియ్యం సీజ్‌

హసన్‌పర్తి : హసన్‌పర్తి మండలం ఎల్లాపురంలో ఓ ప్రాంతంలో నిల్వ ఉన్న పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఎల్లాపురంలోని డి.రమేశ్‌ ఇంట్లో రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నాయనే పక్కా సమాచారంతో బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 16 ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల్లో రేషన్‌ బియ్యం లభ్యమైనట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ తెలిపారు. అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈదాడుల్లో కానిస్టేబుల్‌ వెంకట్‌ పాల్గొన్నారు.

పాముకాటుతో కౌలురైతు మృతి

పాలకుర్తి టౌన్‌:(దేవరుప్పు) : పాముకాటుకు గురైన ఓ కౌ లురైతు చికిత్స పొందుతూ బుఽ దవారం చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. దేవరుప్పల మండలం ధర్మగడ్డకు చెందిన పంగ ప్రవీణ్‌(27) రెండేళ్ల క్రితం వివాహం చేసుకోగా ఓ పసికందు(11నెలలు) జన్మించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూ రు మండలం కూరెళ్లలో తన బావతో కలిసి కౌలుకు భూమిని తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రవీణ్‌ పాముకాటుకు గురయ్యాడు. దీంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవే ట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందిన ట్లు గ్రా మస్తులు తెలిపా రు. ఈఘటన స్థానికంగా విషా దం నింపిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement