● అప్రమత్తమై రైలును నిలిపిన సిబ్బంది
స్టేషన్‌ఘన్‌పూర్: ఓ గూడ్స్ వ్యాగన్‌లో మంటలు అంటుకుని పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రైలును స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిలిపివేశారు. బుధవారం రామగుండం నుంచి రాయచూర్‌కు బొగ్గులోడ్‌తో వెళ్తున్న గూడ్స్ స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఈ సమయంలో ఓ వ్యాగన్‌లో మంటలు అంటుకుని పొగలు వస్తుండగా రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై రైలును నిలిపి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వ్యాగన్‌పైకి ఎక్కి మంటలను ఆర్పా రు. కాగా, గూడ్స్ వ్యాగన్‌లో పొగలు రావడంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేయగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై రైల్వే అధికారులను సంప్రదించగా బొ గ్గులోడ్‌లతో వెళ్తున్న గూడ్స్‌లో ఇలా మంటలతో పొగలు వ్యాపించడం సాధారణమని, ఎండ తీవ్రత, వేడితో ఇలా జరుగుతుంటాయని, ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.
‘ఇంగ్లిష్ ఫర్ మాస్టరీ’ పుస్తకావిష్కరణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం నూతన సిలబస్‌కు అనుగుణంగా రూపొందించిన ‘ఇంగ్లిష్ ఫర్ మాస్టరీ’ పుస్తకాన్ని బుధవారం వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి ఇంగ్లిష్ విభాగం అధిపతి ఆర్. మేఘనారావు, దీపాజ్యోతి, పి. నిర్మల సంపాదకులుగా వ్యవహరించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేలా ఈపుస్తకాన్ని రూపొందించినట్లు మేఘనారావు తెలిపారు. కేయూ పాలకమండలి సభ్యుడు బి. సురేశ్‌లాల్, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఓఎస్‌డీ బి.వెంకట్రామ్‌రెడ్డి,కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. నర్సింహాచారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోలాశంకర్ తదితరులు పాల్గొన్నారు.


