లేని ఇంటికి 20 ఏళ్లుగా పన్ను! | - | Sakshi
Sakshi News home page

లేని ఇంటికి 20 ఏళ్లుగా పన్ను!

Jul 16 2026 4:54 AM | Updated on Jul 16 2026 4:54 AM

లేని ఇంటికి 20 ఏళ్లుగా పన్ను!

హన్మకొండ అర్బన్‌: గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యంతో ఓ సామాన్య రైతు ఇరవై ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాడు. ఐనవోలు మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన కలువాల వెంకటయ్య వృత్తిరీత్యా రైతు. గ్రామంలోని 6వ వార్డులో ఉన్న ఇంటి నంబర్‌ 5–31 ఇల్లు 40 ఏళ్లుగా వెంకటయ్య పేరిట రికార్డుల్లో ఉంది. 2006 జూలై 4న వారి ఇంటి ముందున్న (ఇంటి నంబర్‌ 5–30 గల) మరో పాత ఇంటిని కొన్నాడు. అనంతరం ఆ ఇంటిని కూల్చి, స్థలాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ సమయంలో కూల్చిన ఇంటి నంబర్‌ 5–30 ను రద్దు చేయాలని గ్రామ పంచాయతీకి అధికారికంగా నోటీసులు ఇచ్చి, నిబంధనల ప్రకారం.. రూ.3,000 ఫీజు కూడా చెల్లించాడు. దాంతో రికార్డుల నుంచి ఆ నంబర్‌ను పూర్తిగా తొలగించినట్లు గ్రామ పంచాయతీ అధికారులు ప్రకటించి నోటీస్‌ బోర్డులో పెట్టారు.

సిబ్బంది నిర్వాకం

గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్వాకం వల్ల రద్దయిన ఇంటి నంబర్‌ 5–30కి ఏటా ఇంటి పన్ను డిమాండ్‌ నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. రవి కుటుంబ సభ్యులు పంచాయతీ వారు అడిగిన పన్ను కడుతూ వచ్చారు. ఇటీవల వెంకటయ్య మరణానంతరం కుమారుడు కలువాల రవి 5–31 ఇంటిని తన పేరు మీదకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి తన నివాస గృహమైన 5–31 నంబరుకు పన్ను కడతానని కోరగా, సిబ్బంది మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 5–30 నంబర్‌తో కూడిన రశీదును చేతిలో పెట్టారు. దీంతో బాధితుడు రెండు నెలల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశించినా సిబ్బందిలో మాత్రం చలనం రాలేదు. కాగా, ఇదే విషయమై డీఎల్పీఓ గంగాభవానీ మాట్లాడుతూ.. ‘పొరపాటు జరిగింది వాస్తవమే. ఆయన మాకు ఫిర్యాదు చేశాడు. దాన్ని పరిశీలించాం నివేదిక పంపించాం. తొందరపడితే కాదు దానికి టైం పడుతుంది. ఫైల్‌ కలెక్టర్‌ దగ్గరికి వెళ్లాలి. కలెక్టర్‌ చూసాక ఓకే అంటే ఇంటి నంబర్‌ మారుతుంది. ప్రాసెస్‌ ప్రకారం జరగాల్సిన పని పదేపదే ఫిర్యాదులు చేస్తే కాదు’ అని సమాధానం ఇచ్చారు.

మార్చమని వేడుకున్నా

అధికారుల నిర్లక్ష్యం

బాధితుడి ఆవేదన..

కలెక్టరేట్‌లో ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement