క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతీగా బొడ్డుచింతలపల్లి | - | Sakshi
Sakshi News home page

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతీగా బొడ్డుచింతలపల్లి

Jul 15 2026 12:41 AM | Updated on Jul 15 2026 12:41 AM

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతీగా బొడ్డుచింతలపల్లి

దేశంలోనే ద్వితీయ స్థానంలో

నిలిచిన గ్రామం

గీసుకొండ: మండలంలోని బొడ్డుచింతలపల్లి గ్రామం దేశంలోనే క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతీగా నిలిచింది. ప్రతీ నెల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ విభాగంలో పంచాయతీలను ఎంపిక చేసి అవార్డులను ప్రకటిస్తోంది. ఈ మేరకు గత జూన్‌ నెలకు గా ను గీసుకొండ మండలం బొడ్డుచింతలపల్లి సర్పంచ్‌ పోగుల వనిత చేపట్టిన పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచినట్లు పంచాయత్‌ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. కాగా, మొదటి బహుమతి అసోం రాష్ట్రానికి చెందిన మోరిడాల్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కంగుకనా చేతియా నిలవగా ద్వితీయ బహుమతి పోగుల వనితకు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడి అరెస్ట్‌

ఖిలా వరంగల్‌ : జల్సాలు, విలాసాల కోసం చో రీ లకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వరంగల్‌ ఏనుమాముల ఇన్‌స్పెక్టర్‌ జవ్వాజి సురేశ్‌ మంగళవారం తెలిపా రు. వరంగల్‌ శంభునిపేటకు చెందిన ఎండీ సొహె ల్‌ జల్సాలు, విలాసాల కోసం పరకాల, ఏనుమాముల పీఎస్‌ల పరిధిలో సెల్‌ఫోన్లు చోరీ చేసి అరైస్టె జైలుకెళ్లొచ్చాడు. తర్వాత కూడా చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 11న రాత్రి ఆరెపల్లి అయ్యప్ప కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి 2 సెల్‌ ఫోన్లు, 2 చేతి గడియారాలు, రూ.11,500 నగదు చోరీ చేశాడు. ఆ సొమ్మును విక్రయించడానికి ఏనుమాముల వైపునకు వస్తున్నాడు. అదే సమయంలో బాలాజీ నగర్‌ జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను చూ సి పారిపోయేందుకు యత్నించగా పట్టుకుని విచా రించగా నేరం అంగీకరించాడు. దీంతో రెండు సెల్‌ఫోన్లు, వాచ్‌, రూ.11,500 నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement