‘మోడల్‌’ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘మోడల్‌’ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి

Jul 15 2026 12:41 AM | Updated on Jul 15 2026 12:41 AM

హన్మకొండ : మోడల్‌ సోలార్‌ గ్రామాల్లో పనులు ఈ నెలఖరులోపు పూర్తి చేయాలని రెడ్‌ కో వైస్‌ చైర్మన్‌, ఎండీ ముషారఫ్‌ ఫారూఖీ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 37 మోడల్‌ సోలార్‌ విలేజ్‌ల పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్‌ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని జిల్లాల ఎస్‌ఈలతో వీడియో కా న్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఇందులో టీజీఎన్పీడీసీఎ ల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి, పది సర్కిళ్ల సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్లు, సంబంధిత అధికా రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ ముషా రఫ్‌ ఫారూఖీ మాట్లాడుతూ రెడ్‌కో, ఎన్పీడీసీఎల్‌, సంబంధిత ఏజెన్సీలు నిరంతరం సమన్వయంతో ముందుకెళ్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు. టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డితో కలిసి త్వరలో ఉమ్మడిగా ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మోడల్‌ సోలార్‌ గ్రామాలను సందర్శించనున్నట్లు తెలిపారు. అధికారులు ఆ లోగా పనులన్నీ సి ద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్పీడీసీ ఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి మాట్లాడుతూ నిర్దేశిత లో గా సోలార్‌ గ్రామాల్లో ఇంటి పైకప్పులపై సోలార్‌ ప్యానెళ్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కావాల్సిన మీటర్లు అందుబాటులో ఉన్నాయని, యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని ఎస్‌ ఈలను ఆదేశించారు. డైరెక్టర్‌ వి.మోహన్‌ రావు, చీఫ్‌ ఇంజినీర్లు వెంకటరమణ, అశోక్‌, జీఎం గౌత మ్‌ రెడ్డి, మల్లికార్జున్‌, అధికారులు పాల్గొన్నారు.

రెడ్‌కో వైస్‌ చైర్మన్‌,

ఎండీ ముషారఫ్‌ ఫారూఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement