రేవంత్‌ది దుష్టపాలన | - | Sakshi
Sakshi News home page

రేవంత్‌ది దుష్టపాలన

May 2 2026 7:20 AM | Updated on May 2 2026 7:20 AM

హన్మకొండ: రేవంత్‌ది నీచ, దుష్టపాలన అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు అని... రేవంత్‌ పాలనలో రెండు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన చరిత్ర సమస్తం హీనం అని అన్నారు. కేసీఆర్‌ కొట్లాడి తెలంగాణ సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్‌ తన పాత చరిత్రను పునరావృతం చేస్తోందని తూర్పారబట్టారు. సాగు, తాగు నీటిఎద్దడి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులు హామీల అమలు, పాలన గాలికొదిలేశారని విమర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ రైతు ద్రోహి రేవంత్‌ రెడ్డి అని ధ్వజమెత్తారు. రైతుల పక్షాన కేటీఆర్‌ని తీసుకొచ్చి రైతు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది కేసీఆర్‌ రైతు సభ నిర్వహిస్తామన్నారు. ఒక్క ఎమ్మెల్యే అయినా కొనుగోలు కేంద్రాలను సందర్శించారా.. అని ప్రశ్నించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాతూ.. కాంగ్రెస్‌ మోసాన్ని ఎండగట్టేందుకు మే 6న వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ రైతు సదస్సు నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, డీఎస్‌ రెడ్యా నాయక్‌, దాస్యం వినయ్‌ భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్‌, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, వాసుదేవ రెడ్డి, జోరిక రమేష్‌, బడే నాగజ్యోతి, లక్ష్మణ్‌ రావు, హరి రమాదేవి, పులి రజినీకాంత్‌, నయీముద్దీన్‌, రాజ్‌ కిషోర్‌, జానకిరాములు, శ్యామ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

రైతు సదస్సు సభాస్థలి పరిశీలన

వరంగల్‌ మహానగరంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సు కోసం హనుమకొండ హంటర్‌ రోడ్డులో స్థలాన్ని శుక్రవారం బీఆర్‌ఎస్‌ నాయకులు పరిశీలించారు.

శాసన మండలి ప్రతిపక్ష నేత

మధుసూదనాచారి

Advertisement
 
Advertisement
Advertisement