బీఆర్‌ఎస్‌ కబ్జాలపై సీఐడీ విచారణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ కబ్జాలపై సీఐడీ విచారణ చేయాలి

Mar 30 2026 7:16 AM | Updated on Mar 30 2026 7:16 AM

బీఆర్‌ఎస్‌ కబ్జాలపై సీఐడీ విచారణ చేయాలి – 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026

మైనింగ్‌ మాఫియా విచ్చలవిడితనానికి గుట్టలన్నీ గుల్ల అవుతున్నాయి. అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట చేపట్టి అక్రమ మైనింగ్‌ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టారు. అనుమతుల పేరిట పరిమితికి మించి, హద్దులు దాటి గుట్టలను కరిగించారు. భువనగిరి–ఆరెపల్లి బైపాస్‌ పక్కన.. నగరాన్ని ఆనుకుని ఉన్న కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. నిబంధనలు పక్కనబెట్టి రూ.కోట్లాది విలువైన మట్టిని, రాళ్లను యథేచ్ఛగా తరలించారు. మైనింగ్‌ దందాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.

అక్రమ మైనింగ్‌తో

ఆనవాళ్లు కోల్పోయిన

కోమటిపల్లి గుట్ట

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు.. జీవవైవిధ్యం, నగర ప్రశాంతతను దెబ్బతీసే విధంగా గుట్టలను గుల్ల చేశారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారం రెవెన్యూ శివారులోని కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. ఈ గుట్ట మొరం క్వారీగా మారింది. అనుమతికి మించి యథేచ్ఛగా గుట్టను కొల్లగొట్టారు. విచ్చలవిడిగా సాగిన ఈ వ్యవహారంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒకరు భాగస్వామిగా ఉండి.. తన స్నేహితుడి కుమారుడికి లీజు ఇచ్చినట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా మొరం తరలించి గుట్టను గుల్ల చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో త్వరలోనే విచారణకు ఆదేశించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. కోమటిపల్లి గుట్టే కాదు.. ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా సాగుతున్న అక్రమ మైనింగ్‌పై ‘విజిలెన్స్‌’ రంగంలోకి దిగనుండడం చర్చనీయాంశంగా మారింది.

ఇష్టారాజ్యంగా మైనింగ్‌..

విచ్చలవిడిగా తరలింపు..

2017లో క్వారీకి అనుమతి పొందిన ఓ వ్యాపారి మరో ప్రాంతంలో మొరం తవ్వకాలు చేపట్టాడు. దీంతో అప్పుడు ఉన్న మైనింగ్‌, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఆ క్వారీ రెన్యువల్‌ కాలేదు. ఏడాదికోసారి పర్యావరణం, కార్మిక శాఖల అనుమతులు పొందాల్సి ఉంది. ఇవేమీ లేకుండా క్వారీ నిర్వహణ సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. 50 నుంచి 60 ఫీట్ల లోతు వరకు మొరం గుట్టను తవ్వారు. అయితే బండరాళ్లు రావడంతో వదిలివేసి.. మరో ప్రాంతంలో తవ్వుతున్నారు. ఇలా 20 నుంచి 30 ప్రాంతాల్లో గుట్టను బ్లాస్టింగ్‌ చేసి చీల్చారు. లీజు కాలం ముగిసినా ఈ గుట్టపై 2023 వరకు యథేచ్ఛగా తవ్వకాలు సాగాయి. వరంగల్‌ నగరం శివారుతో పాటు నగరంలో సాగుతున్న వందలాది కొత్త నిర్మాణాల కోసం ఇక్కడి మొరం సరఫరా చేశారు. ఆ సమయంలో ఒక హెక్టారు లీజుకు ఏడాదికి లక్ష రూపాయలతో పాటు మొరం రవాణా కోసం పర్మిట్‌ అవసరం. క్యూబిక్‌ మీటరుకు రూ.70 చొప్పున సర్కారు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఒక ట్రాక్టర్‌ బయటికి వెళ్లిందంటే రూ.210 చెల్లించాలి. ఒక ట్రాక్టర్‌లో మూడు క్యూబిక్‌ మీటర్ల మొరాన్ని తరలించవచ్చు. ప్రతి రోజు ఇక్కడి నుంచి వెయ్యి ట్రిప్పుల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. రోజుకు సర్కారు రూ.2.10 లక్షల ఆదాయాన్ని కోల్పోయిందంటే.. అధికారుల అండతో కోమటిపల్లి గుట్టపై మొరం మాఫియా ఏ మేరకు అక్రమార్జన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్‌లో ఓ ఉదాహరణ మాత్రమే.. ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. కాగా అక్రమ మైనింగ్‌పై శనివారం అ సెంబ్లీ లో ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించడంతో పలుచోట్ల మై నింగ్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

హసన్‌పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్‌ 340లో సుమారు 57 ఎకరాల్లో కోమటిపల్లి గుట్ట ఆక్రమించుకుని ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల, ఇంటర్నేషనల్‌ స్టేడియానికి కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. అయినా అప్పటి సర్కారు 341/1 సర్వేనంబర్‌ పేరిట 3.260 రెండున్నర హెక్టార్ల భూమిని క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి ఐదేళ్ల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్‌అండ్‌1/ డబ్ల్యూజీఎల్‌/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. ఈ క్వారీని గతంలో కీలక ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు, సన్నిహితుడు తన కుమారుడి పేరిట కేటాయించారు. అయితే ఇందులో సదరు ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్‌ పార్టనర్‌గా ఉన్నట్లు తనిఖీలకు వెళ్లిన సందర్భంగా అధికారుల విచారణలో వెల్లడి కావడం గమనార్హం.

శాసనసభలో పశ్చిమ ఎమ్మెల్యే

నాయిని రాజేందర్‌రెడ్డి

లీజు ఒకచోట.. తవ్వకాలు మరోచోట

రూ.కోట్లాది విలువైన మట్టి, రాళ్ల తరలింపు

కోమటిపల్లి గుట్టను కొల్లగొట్టిన అక్రమార్కులు

ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగిన దందా

మైనింగ్‌ దందాపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement