వరంగల్ అర్బన్: మొండి పన్ను బకాయిదారులను వదలొద్దని, రెడ్ నోటీసులు జారీ చేయడంతోపాటు ఆస్తులను సీజ్ చేయాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఆదివారం పన్నుల వసూళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంకా రెండు రోజులు మా త్రమే గడువు మిగిలి ఉన్నందున, ప్రతి అధికారి, ఉద్యోగి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి నిర్దేశి త లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ఆస్తి ప న్నుపై ఎలాంటి వడ్డీ మాఫీ లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఈ నెల 31వ తేదీలోపు పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్


