బాధ్యతగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

Mar 23 2026 10:02 AM | Updated on Mar 23 2026 10:02 AM

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

ఖిలా వరంగల్‌: జనగణన శిక్షణ ఎంతో కీలకమని, జనగణన విజయవంతానికి ప్రతిఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్‌ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో జనగణన 2027 సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. చార్జ్‌ సెన్సెస్‌ క్లర్క్‌లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు జనగణన ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని సూచించారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి అవసరమైన కచ్చితమైన గణాంకాలు అందుతాయని, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఇవి కీలకమన్నారు. ప్రతీ ఇంటిని సందర్శించి సరైన వివరాలను సేకరించడం సిబ్బందిపై ఉందన్నారు. అనంతరం సిబ్బందికి విధివిధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జిల్లా సెన్సెస్‌ అధికారి (డీఆర్‌ఓ) విజయలక్ష్మి, ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ, ఆర్డీఓ సుమ, తహసీల్దార్‌ ఇక్బాల్‌, అధికారులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

వాగ్దేవిలో జనగణన శిక్షణ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement