మూడో విడత ప్రశాంతం
సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. హనుమకొండ జిల్లాలో మూడో విడతలో 86.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో మొత్తం 1,11,341 మంది ఓటర్లు ఉండగా.. 96,239 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంట వరకు పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు చేపట్టిన అధికారులు ఫలితాలు వెల్లడించారు. పోలింగ్, ఫలితాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విజయోత్సవాలకు అనుమతి అనుమతి లేకపోయినా గెలిచిన అభ్యర్థుల ఆనందో త్సాహాలు అడ్డుకునే పరిస్థితి కనిపించలేదు.
వరంగల్ జిల్లాలో తొలి, రెండు దశలను
మించి పెరిగిన ఓటింగ్ శాతం
వరంగల్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని 946 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. నాలుగు మండలాల్లో 60,987 మంది పురుషులకు 53,959 మంది, 63,561 మంది మహిళలకు 55,908 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పురుషులు 88.47 శాతం వినియోగించుకుంటే మహిళలు కాస్త తక్కువగా 87.95 శాతం ఓటేశారు. మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగంలో పురుషులే ముందున్నారు. 1,24,555 మంది ఓటర్లకు 1,09,870 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంటలోపు క్యూలో నిలుచున్న ఓటర్లకు అవకాశం ఇవ్వగా.. మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కొనసాగింది. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు లేక ఇబ్బందులు పడడం, ఒకటి రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొ ట్టారు.ఇవి మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
హనుమకొండ జిల్లాలో
86.44 శాతం, వరంగల్‌జిల్లాలో 88.21 శాతం నమోదు
సంబురాల్లో మునిగిన విజేతలు
మూడో విడత ప్రశాంతం


