చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: పిల్లల్లో సృజనాత్మకత కలిగించేలా ప్రణాళికలు రూపొందించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్‌లో మేయర్, కమిషనర్, డబ్ల్యూఆర్‌ఐ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్‌లో భాగంగా నగరంలో 0–5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల మానసిక వికాసం పక్వతపై దృష్టి సారించాలని డబ్ల్యూఆర్‌ఐ ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల ఫొటోలు వీడియోలను మేయర్, కమిషనర్ ఎదుట ప్రదర్శించి వివరించారు. బల్దియా అధికారులను ప్రధాన భాగస్వామ్యం చేస్తూ రెండు వర్క్‌షాప్‌లు నిర్వహించి అవగాహన కలిగించాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ రవికుమార్, డీఈ కార్తీక్‌రెడ్డి, డబ్ల్యూఆర్‌ఐ ప్రతినిధులు సోహానీ గుప్తా, ఎలెన్ వీఎల్‌ఎఫ్ ఫౌండేషన్ ప్రతినిధి అమీర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
అనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రంలో నూతన యూనిట్ (షెడ్డు) ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం హసన్‌పర్తి భీమారం సమీపంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ వద్ద బల్దియా నిర్మించిన ఏబీసీ కేంద్రంతో పాటు, హనుమకొండ పరిధిలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లకు బిల్లుల చెల్లింపుల కోసం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం హనుమకొండ పరిధి 56వ డివిజన్ పరిమళ కాలనీ, 60వ డివిజన్ టీచర్స్ కాలనీ ఫేజ్–2తో పాటు 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్ డాక్టర్ కాలనీ, 49వ డివిజన్ జూలై వాడ ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లను కొలతలు వేసి పరిశీలించి నిర్మాణ తీరుపై సంతప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో ఈఈ రవికుమార్, డీఈలు సారంగం, రవికిరణ్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


