నేటి నుంచి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు : డీఈఓ గిరిరాజ్
విద్యారణ్యపురి: జిల్లా స్థాయి బాలబాలికల విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ గిరిరాజ్ గౌడ్ తెలిపారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్, ఆత్మనిర్భర భారత్ కోసం శాస్త్ర సాంకేతిక, గణితం, ఇంజనీరింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఈ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. హనుమకొండ విద్యానగర్‌లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్‌లో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను డీఈఓ ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస స్వామి, సమగ్ర శిక్ష కో– ఆర్డినేటర్లు బద్దం సుదర్శన్‌రెడ్డి, బి.మహేశ్, బండారు మన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.


