తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలి
వరంగల్ అర్బన్: ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసేలా కాలనీల్లో అవగాహన కల్పించాలని బల్ది యా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్‌లోని 25, 26వ డివిజన్లలో కమి షనర్ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య విధానాలు తనిఖీ చేశారు. ఈసందర్భంగా రెండు కాలనీల్లో పర్యటించి స్వచ్ఛ ఆటోల పనితీరును, 26వ డివిజన్ లక్ష్మీపురంలోని కమేలాను పరిశీలించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనసాగుతున్న పనులు పరిశీలించారు. ఎంహెచ్‌ఓ రాజేశ్, ఏసీపీ ఖలీల్, శానిటరీ సూపర్‌వైజర్ భాస్కర్, ఏఈ హబీబ్, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ అలీ పాల్గొన్నారు.


