నయా ట్రెండ్!
● సర్పంచ్ అభ్యర్థుల ప్రమోషనల్ కాల్స్
● తనకు ఓటు వేయాలని అభ్యర్థన
కాళేశ్వరం: హలో..హలో.. నేను మీ సర్పంచ్ అభ్యర్థిని అంటూ ఫలాన గుర్తుకు ఓటు వేయాలని ఫోన్‌లో అభ్యర్థిస్తున్నారు. కాటారం సబ్‌డివిజన్ పరిధిలో మూడో విడత ఎన్నికలకు ఈనెల 17న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్ మండలాల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితమైన ప్రమోషనల్ కాల్స్‌తో సెల్‌ఫోన్‌లు రింగ్..రింగ్..రింగ్‌మంటూ మోగుతున్నాయి. అభ్యర్థులు వాయిస్‌తో ప్రమోషనల్ కాల్స్ పల్లెల్లో సందడి చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కాగా, సోమవారం సాయంత్రం 5గంటల వరకు ప్రచారానికి తెర పడడంతో కొత్తట్రెండ్‌తో ప్రచారం మొదలైందని చర్చించుకుంటున్నారు. ఏదీఏమైనా అభ్యర్థుల కొత్త ట్రెండ్ పల్లెల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తోంది.


