ఓటమెరుగని నాయకులు..
● ఆ దంపతులు ఐదుసార్లు సర్పంచ్‌గా గెలుపు
దంతాలపల్లి : ప్రస్తుత పరిస్థితుల్లో ఒకసారి సర్పంచ్‌గా పని చేసి మరోసారి గెలువడం కష్టమే. అలాంటిది ఏకంగా ఐదుసార్లు సర్పంచ్‌గా గెలుపొంది ప్రజల మన్ననలు పొంది ప్రజానాయకులుగా పేరొందారు కొమ్మినేని రవీందర్, మంజుల దంపతులు. మండలంలోని దాట్లకు చెందిన ఆ దంపతులు 25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా వారి కుటుంబం నుంచే కొనసాగుతున్నారు. ఉమ్మడి నర్సింహులపేట మండలంలోని దాట్ల గ్రామానికి మూడుసార్లు సర్పంచ్‌గా ఎన్నిక కాగా రెండు పర్యాయాలు రవీందర్, ఒక పర్యాయం మంజుల ఎన్నికయ్యారు. దంతాలపల్లి మండలం ఏర్పడిన అనంతరం దాట్ల సర్పంచ్‌గా రవీందర్ గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో 260 ఓట్లపైచిలుకు ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా మంజుల గెలుపొందారు. ఇలా వరుసగా ఐదుసార్లు సర్పంచ్‌గా ఎన్నికై ఓటమెరగని నాయకులుగా పేరు తెచ్చుకున్నారు.
ఆ కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్..
బచ్చన్నపేట : మండలంలోని తమ్మడపల్లి సర్పంచ్‌గా గెలుపొందిన బేజాడి సిద్ధులు తన కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్. 1995లో తన తండ్రి రాములు, 2006లో తన భార్య సునీత, 2013లో సిద్ధులు, ప్రస్తుతం సిద్ధులే గెలుపొంది ఆ కుటుంబంలో నాలుగో సర్పంచ్ అయ్యారు. నాటి నుంచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు గ్రామస్తులు తమ కుటుంబం పట్ల ఆదరణ, అభిమానం చూపుతున్నారని సిద్ధులు తెలిపారు.
భర్త ఉప సర్పంచ్.. భార్య వార్డు సభ్యురాలు
కమలాపూర్: కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో భార్యాభర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. గ్రా మానికి చెందిన ఆసాల శ్రీ కాంత్ బీఆర్‌ఎస్ తరఫున 4 వ వార్డు నుంచి, ఆయన భా ర్య మౌనిక 9వ వార్డు నుంచి వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడత జీపీ ఎన్నికల అనంతరం శ్రీకాంత్ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఆసాల శ్రీకాంత్, మౌనిక
ఓటమెరుగని నాయకులు..
ఓటమెరుగని నాయకులు..
ఓటమెరుగని నాయకులు..
ఓటమెరుగని నాయకులు..


