ప్రిన్సిపాల్ సమ్మయ్యకు షోకాజ్ నోటీస్
● ఆర్డీఓ, తహసీల్దార్ల వద్ద విద్యార్థుల లేఖలు
● కలెక్టర్‌కు చేరిన ‘చిట్టి చేతులు..
వెట్టి చాకిరీ’ నివేదిక
● చర్యలకు రంగం సిద్ధం..
వరంగల్ క్రైం: ఒగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (పరకాల)లో విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు క్షేత్ర స్థాయిలో పర్యటించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అనంతరం ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ కథనానికి సంబంధించిన అంశాలపై సోషల్ వెల్ఫేర్ సెక్రటరీకి ని వేదిక సమర్పించారు. సెక్రటరీ ఆదేశాల మేరకు డీ సీఓ ఉమామహేశ్వరి సోమవారం సదరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సమ్మయ్యకు, ఆ పాఠశాలలో పనిచేస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టర్‌కు షోక్‌జ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వలని పేర్కొన్నారు. విద్యార్థులు ఫిర్యాదులో పెట్టెలో వేసిన ఫిర్యాదు లేఖలను పరకాల ఆర్డీఓ, దామెర తహసీల్దార్లు స్వాధీనం చేసుకున్న ట్లు సమాచారం. వారు పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకీరి చేయించిన ఘటనతోపాటు పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లపై విద్యార్థులు లేవనెత్తిన అవినీతి విషయాలపై హనుమకొండ కలెక్టర్‌కు నివేదిక అందజేసినట్లు తె లిసింది. ఈనెల 12న ‘చిట్టి చేతులు..వెట్టి చాకిరీ’, 13న ‘వెట్టి చాకిరీపై కదిలిన యంత్రాంగం’ అనే శీర్షి కలతో సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. వీ టిపై స్పందించిన అధికారులు చర్యలకు ఆదేశించా రు. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జోనల్ అధికారి తన నివేదికలో క్రమ శిక్షణ చర్యలకు సిఫా ర్సు చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకుని క్యా టరింగ్ కాంట్రాక్టర్ లైసెన్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రిన్సిపాల్ సమ్మ య్య కొంత మంది విద్యార్థులను తనకు వ్యతిరేకంగా చెప్పుతే టీసీలు ఇస్తానంటూ బెదిరించిన విషయానికి సంబంధించిన ఆడియో కూడా వైరలైంది. ఇప్పటికై నా అధికా రులు గతి తప్పిన గు రుకులాన్ని గా డిలో పెట్టాలని త ల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ప్రిన్సిపాల్ సమ్మయ్యకు షోకాజ్ నోటీస్


