సరదా విషాదమైంది..
ఖిలా వరంగల్ : సరదా విషాదమైంది. సవారీ చే సేందుకు కట్టేసిన గుర్రం వద్దకు వెళ్లిన బాలుడిని గుర్రం తన్నింది. దీంతో బాలుడికి తీవ్రగా గాయాలు కావడంతో కుటుంబీకులు హైదరాబాద్ నిలో ఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆది వారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గుర్రం యజమాని నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ ఏకశి చిల్డ్రన్‌పార్క్ గేట్ ఎదుట నిర్వహించారు. గుర్రం యజమాని, పార్కు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్స్‌కాలనీ పో లీసులు ఘటనాస్థలికి చేరుకుని గుర్రం యజమాని పై కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువుల ధర్నా విరమించా రు. మృతుడి బంధువుల క థనం ప్రకారం.. వరంగల్ శివనగర్ ఏసీరెడ్డినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల కృష్ణ కు మారుడు గౌతం(12) ఈనెల 10వ తేదీన ఉదయం బాబాయి రాజేందర్‌తో కలిసి ఏకశిల చిల్డ్రన్ పా ర్కుకు వెళ్లాడు. పార్కులో సవారీ చేసేందుకు సోదరుడు మహేశ్‌తో కలిసి గుర్రం వద్దకు వెళ్లాడు. అంతలోనే గుర్రం వెనుక నుంచి తన్నడంతో గౌతంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గౌతంను రాజేందర్ హుటాహుటిన ఎంజీఎం త రలించారు. అనంతరం హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు. కాగా, శివనగర్‌లో బాలుడి అంత్యక్రియలు నిర్వహించగా కార్పొరేటర్ ప్రవీణ్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తరలొచ్చి గౌతం మృతదేహం వద్ద నివాళులర్పించారు.
సవారీ కోసం గుర్రం వద్దకు వెళ్లిన బాలుడు
వెనుక నుంచి తన్నగా తీవ్రగాయాలు..
చికిత్స పొందుతూ మృతి
ఏకశిల పార్కు ఎదుట బంధువుల ధర్నా


