ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఎంఓయూ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో కోల్‌కత్తా కేంద్రంగా పని చేస్తున్న అనుదీప్ ఆర్గనైజేషన్‌తో ఒక సంవత్సర కాలానికి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈమేరకు సోమవారం ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, ప్లేస్‌మెంట్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.జితేందర్ కలిసి అనుదీప్ కొల్‌కతా ఆర్గనైజేషన్ మేనేజర్ అండ్ ట్రైనర్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ శ్వేతతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, అధ్యాపకురాలు డాక్టర్ అలేటి సరిత పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: నోయిడాలోని ఇంజనీరింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇంజనీర్స్ ఇండియా, కాకతీయ యూనివర్సిటీ మధ్య నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ ఆధారిత శిక్షణను బలోపేతం చేసేందుకుగాను అవగాహన ఒప్పందం (ఎంఓయూ)ను కేయూలో సోమవారం కుదుర్చుకున్నారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి సమక్షంలో ఇరు సంస్థల మధ్య ప్రతినిధులు సంతకాలు చేసి ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. కేయూ తరఫున రిజిస్ట్రార్ రామచంద్రం, నోయిడా ఇంజనీర్స్ ఇండియా ప్రతినిధి పటేల్‌రోహన్ ఆండే పాల్గొని ఒప్పందంపై సంతకాలు చేశారు.


