మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
వరంగల్ అర్బన్: గ్రేటర్ మహా నగర అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల పర్వం కొనసాగుతున్నట్లు ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రిమెంట్ మొదలుకొని పనులు ప్రారంభించి, వివిధ స్థాయిలో ఇంజినీరింగ్, ఇతర విభాగాల్లో పర్సంటేజీల రూపంలో 13 శాతం సొమ్ము ముట్టజెప్పాల్సి వస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఇంజనీర్లు, అధికారులు జీతాలు, రవాణా సదుపాయాలు పొందుతున్నప్పటికీ పర్సంటేజీల కోసం చేతులు చాస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంతా మామూళ్ల వ్యవహారమే!
జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఏటా రూ.వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఆయా పనులకు సంబంధించి అంచనాల తయారీ, టెండర్ల కేటాయింపు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల బాధ్యతను ఇంజినీరింగ్ విభాగం చూస్తుంటుంది. ఇందుకోసం డ్రాయింగ్ సెక్షన్ అగ్రిమెంట్ సిబ్బంది నుంచి ఎస్‌ఈ స్థాయి వరకు పని చేస్తుంటారు. ఆయా అభివృద్ధి పనుల్లో కింది స్థౠయి నుంచి పై స్థాయిలో ఉన్న అధికారులందరికీ పర్సంటేజీలు అందుతాయనేది బహిరంగ రహస్యంగా మారింది.
పర్యవేక్షకులే పక్కదారి పడితే?
కాంట్రాక్టర్‌లు లాభాపేక్షతో పనులు చేస్తుంటారు. ఇంజినీర్లు పనులు దగ్గర ఉండి శాసీ్త్రయత, నాణ్యతను పరిశీలించాలి. నిబంధనల మేరకు పనులు చేపట్టకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. నోటీసులు అందించి బ్లాక్ లిస్టులో పెట్టాలి. కానీ ప్రజాధనానికి సంరక్షకులుగా ఉండాల్సిన కొందరు ఇంజనీర్లు కాసుల కోసం నిబంధనల్ని పక్కన పెట్టి చేతులు చాస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు నిర్మించిన కొద్ది నెలలకే పగుళ్లు చూపుతున్నాయి.
బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్ల గగ్గోలు..
ప్రతీ పనికి కమీషన్ల భారం పెరిగిపోతోందని, బిల్లులు మాత్రం సకాలంలో చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. బడా కాంట్రాక్టర్లకు మినహా మధ్య, సాధారణ కాంట్రాక్టర్లకు టెండర్లు గిట్టుబాటు అవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ అగ్రిమెంట్ బిల్లు రికార్డు, చివరి చెక్కు చేతికందే వరకు ఏఈకి 3శాతం, డీఈకి 2శాతం, ఈఈకి 1 శాతం, ఎస్‌ఈకి 1శాతం, డీబీ, సెక్షన్, 1.5 శాతం, క్వాలిటీ కంట్రోల్, అడిట్, అకౌంటింగ్ విబాగంలో, కార్పొరేటర్ వరకు మొత్తంగా 13 వరకు కమీషన్ల రూపంలో చెల్లిస్తున్నట్లు కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించా ల్సిందే. థర్డ్ పార్టీ క్వాలిటీ నిపుణులు పరిశీలిస్తుంటారు. ఏమైనా తేడాలోస్తే బిల్లుల్లో కోత పెడతాం.
– సత్యనారాయణ, ఎస్‌ఈ
అభివృద్ధి పనుల్లో
అవినీతి జలగలు!
ఇసుకకు బదులు స్టోన్ క్రషర్ వాడకం
నాసిరకం కంకర, సిమెంట్..
మేసీ్త్రలే క్వాలిటీ ఇన్‌స్పెక్టర్లు
మూణ్నాళ్లకే నాణ్యతా
ప్రమాణాలకు మంగళం
ఏజెంట్ల ద్వారా ఇంజనీర్ల వసూళ్లు
కాంట్రాక్టర్ల నుంచి
ప్రజాప్రతినిధులకు వాటాలు
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


